వృద్ధుడి పొట్టలో గ్లాసు.. వైద్యుల షాక్‌

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు తనకు తీవ్రంగా కడుపు నొప్పి వస్తోందంటూ జిల్లా ఆసుపత్రిలో చేరాడు.

Updated : 05 Oct 2022 08:48 IST

ధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు తనకు తీవ్రంగా కడుపు నొప్పి వస్తోందంటూ జిల్లా ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు అతని పొట్టలో గ్లాసు ఉండడంతో షాక్‌కు గురయ్యారు. నాలుగు నెలల క్రితం అమావత్‌ గ్రామానికి వెళ్లిన రామ్‌దాస్‌ అనే వృద్ధుడిని కొందరు దారుణంగా కొట్టారు. అనంతరం ఓ గ్లాసుపై కూర్చోబెట్టారు. దీంతో గ్లాసు అతని పొట్టలోకి వెళ్లిపోయింది.

గ్రామస్థులు ఈ అమానవీయ చర్యను చూసినప్పటికీ ఎలాంటి సహాయం చేయలేకపోయారు. ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా రాందాస్‌ సిగ్గుతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నొప్పి ఎక్కువ కావడంతో చతుఖేడ చేరుకుని గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్థులు అతడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు పొట్టలో గ్లాసు ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చేసి దానిని బయటకు తీస్తామని తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts