రూ.317 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ స్వాధీనం

గుజరాత్‌, ముంబయిల్లోని వేర్వేరు ప్రాంతాల్లో రూ.317 కోట్ల విలువైన భారత నకిలీ కరెన్సీని సూరత్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రూ.2000, రూ.500 నోట్లతో పాటు రద్దు చేసిన రూ.1000, రూ.500 నోట్లు కూడా ఉన్నాయి.

Published : 05 Oct 2022 05:53 IST

సూరత్‌: గుజరాత్‌, ముంబయిల్లోని వేర్వేరు ప్రాంతాల్లో రూ.317 కోట్ల విలువైన భారత నకిలీ కరెన్సీని సూరత్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రూ.2000, రూ.500 నోట్లతో పాటు రద్దు చేసిన రూ.1000, రూ.500 నోట్లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు వికాస్‌ జైన్‌ను ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు. అతను వివిధ నగరాల్లో శాఖలతో కొరియర్‌ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు అధికారులు మంగళవారం వెల్లడించారు.


115 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

దిల్లీ: ఆర్థిక నేరాల్లో ప్రమేయం గల 300 మంది సైబర్‌ నేరస్థులు లక్ష్యంగా ‘ఆపరేషన్‌ చక్ర’ పేరిట దేశంలోని 115 ప్రాంతాల్లో సీబీఐ మంగళవారం సోదాలు నిర్వహించింది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసుల సహకారంతో సీబీఐ ఈ దాడులు చేపట్టింది. ఈ సందర్భంగా రాజస్థాన్‌లో రూ.1.5 కోట్ల నగదు, అరకేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఇంటర్‌పోల్‌, ఎఫ్‌బీఐ, రాయల్‌ కెనడియన్‌ మౌంటైన్‌ పోలీసు, ఆస్ట్రేలియా ఫెడరల్‌ పోలీసు విభాగాల నుంచి అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని