కుల్లూలో దసరా వేడుకలకు మోదీ

ప్రధాని నరేంద్రమోదీ బుధవారం హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లూలో దసరా పండుగ చేసుకోనున్నారు. ఇటీవలి కాలంలో ఒక్కో పండుగ కోసం ఒక్కో ప్రాంతానికి ఆయన వెళ్తున్న విషయం తెలిసిందే.

Updated : 05 Oct 2022 06:39 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ బుధవారం హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లూలో దసరా పండుగ చేసుకోనున్నారు. ఇటీవలి కాలంలో ఒక్కో పండుగ కోసం ఒక్కో ప్రాంతానికి ఆయన వెళ్తున్న విషయం తెలిసిందే. కుల్లూలో జరిగే అంతర్జాతీయ దసరా ఉత్సవాలను, దాదాపు 300 మంది దేవతల విగ్రహాలతో సాగే ప్రత్యేక రథయాత్రను ప్రధాని బుధవారం తిలకించనున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ అంతర్జాతీయ ఉత్సవాల్లో ప్రధాని పాల్గొనడం ఇదే తొలిసారి. ఇటీవల ఆయన అహ్మదాబాద్‌లో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. వినాయకచవితికి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ నివాసానికి వెళ్లి విఘ్నేశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్నారు. రక్షాబంధన్‌, బిహు, గురుపౌర్ణమి, దీపావళి, బుద్ధజయంతి వంటి వేడుకలకు వేర్వేరు చోట్లకు మోదీ వెళ్లారు.

విలేకరులపై వివాదాస్పద ఉత్తర్వు

ప్రధాని బుధవారం కుల్లూతో పాటు హిమాచల్‌లోని బిలాస్‌పుర్‌కు కూడా వెళ్లనున్నారు. అక్కడ జరిగే సభలో మాట్లాడతారు. ఈ సమావేశం కవరేజికి హాజరయ్యే విలేకరుల గుణగణాలు ఎలాంటివో తెలిపే ధ్రువపత్రాలను పోలీసులు కోరడం వివాదాస్పదమయింది. బిలాస్‌పుర్‌ ఎస్పీ ఈ రాతపూర్వక ఉత్తర్వులు జారీచేయగా, సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన విమర్శల తర్వాత డీజీపీ సంజయ్‌ కుందూ వీటిని మంగళవారం రద్దు చేశారు. జరిగినదానిపై విచారం వ్యక్తపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు