ఉక్రెయిన్‌ యుద్ధానికి సైనిక పరిష్కారం లేదు

ఉక్రెయిన్‌ యుద్ధానికి సైనికపరమైన పరిష్కారం లేదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. అక్కడి అణు కేంద్రాలకు ముప్పు వాటిల్లితే అది తీవ్ర విపరిణామాలకు దారి తీయవచ్చన్నారు.

Updated : 05 Oct 2022 06:36 IST

అణు కేంద్రాలకు ముప్పు వాటిల్లితే విపరిణామాలే
జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ ఫోన్‌

దిల్లీ: ఉక్రెయిన్‌ యుద్ధానికి సైనికపరమైన పరిష్కారం లేదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. అక్కడి అణు కేంద్రాలకు ముప్పు వాటిల్లితే అది తీవ్ర విపరిణామాలకు దారి తీయవచ్చన్నారు. మంగళవారం ఆయన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్లో మాట్లాడారు. చర్చలు, దౌత్యం ద్వారా యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకడానికి ప్రయత్నం జరగాలని ఇదివరకే తాను పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. శాంతిని నెలకొల్పే ఎలాంటి చర్యల్లోనైనా సాయపడేందుకు భారత్‌ సిద్ధమని జెలెన్‌స్కీకి మోదీ తెలిపారు. ఐరాస, అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ద్వైపాక్షిక సంబంధాలపైనా మోదీ-జెలెన్‌స్కీ చర్చించుకున్నారు.


ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి మరిన్ని అధునాతన రాకెట్‌ వ్యవస్థలు

వాషింగ్టన్‌: యుద్ధంలో రష్యాను నిలువరించేందుకు వీలుగా ఉక్రెయిన్‌కు మరో నాలుగు అధునాతన రాకెట్‌ వ్యవస్థలను త్వరలో అందజేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. కొత్తగా ఇవ్వబోయే 62.4 కోట్ల డాలర్ల సైనిక సాయంలో భాగంగా ‘హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్‌ సిస్టమ్స్‌’ను ఇవ్వబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని