వాణిజ్య సేవలకు సిద్ధమవుతున్న జీఎస్‌ఎల్‌వీ-ఎంకే3

భారతీయ ‘బాహుబలి’ వాహకనౌకగా అభివర్ణించే జీఎస్‌ఎల్‌వీ-ఎంకే3 ఈ నెల 22న ప్రపంచ వాణిజ్య విపణిలోకి అడుగుపెట్టనుంది.

Published : 07 Oct 2022 03:23 IST

ఈనాడు, బెంగళూరు: భారతీయ ‘బాహుబలి’ వాహకనౌకగా అభివర్ణించే జీఎస్‌ఎల్‌వీ-ఎంకే3 ఈ నెల 22న ప్రపంచ వాణిజ్య విపణిలోకి అడుగుపెట్టనుంది. ఆ రోజు అర్ధరాత్రి 12:12 గంటలకు బ్రిటిష్‌ అంతరిక్ష అంకుర సంస్థ వన్‌వెబ్‌కు చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్‌ ఉపగ్రహాలను శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి మోసుకెళ్లనుంది. న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)- ఇస్రోల ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. నాలుగు టన్నుల బరువున్న ఉపగ్రహాలను జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీఓ)లో ప్రవేశపెట్టే ఈ ప్రయోగం ఎన్‌ఎస్‌ఐఎల్‌, ఇస్రో చరిత్రలో మైలురాయి అని ఎన్‌ఎస్‌ఐఎల్‌ చైర్మన్‌ డి.రాధాకృష్ణన్‌ తెలిపారు. ఈ వాహకనౌకను లాంచ్‌ వెహికిల్‌ మార్క్‌-3గా కూడా పిలుస్తారు. దేశానికి చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్‌ ఈ ప్రయోగానికి నిధులు సమకూర్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని