గోశాలకు నాలుగున్నర ఎకరాలు.. ముస్లిం వ్యక్తి విరాళం

కర్ణాటకలో మహ్మద్‌ నజీర్‌ అనే ఓ ముస్లిం వ్యక్తి చూపిన దాతృత్వానికి ప్రశంసలు కురుస్తున్నాయి. గోశాల నిర్మాణానికి రూ.2 కోట్ల విలువైన నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు.

Published : 07 Oct 2022 05:05 IST

కర్ణాటకలో మహ్మద్‌ నజీర్‌ అనే ఓ ముస్లిం వ్యక్తి చూపిన దాతృత్వానికి ప్రశంసలు కురుస్తున్నాయి. గోశాల నిర్మాణానికి రూ.2 కోట్ల విలువైన నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. మహ్మద్‌ నజీర్‌.. కాఫీ గింజల వ్యాపారం చేస్తున్నారు. ఆయన విరాళంగా ఇచ్చిన స్థలంలో గోశాలతో పాటు అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం, పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం కట్టనున్నారు. కాడూరు-మంగళూరు జాతీయ రహదారి-173 పక్కనున్న ఆ భూమి విలువ దాదాపు రూ.2 కోట్లు వరకు ఉంటుంది. ఈ భూమిని చిక్కమగళూరుకు చెందిన స్వామి సమర్థ్‌ రామదాస ట్రస్ట్‌కు దానంగా ఇచ్చారు ‘నా తల్లికి క్యాన్సర్‌ ఉండేది. అమెతో ఓసారి గోమూత్రం తాగించాను. దీంతో వ్యాధి నయమైంది. ఆ గోమాత రుణం తీర్చుకోవడానికి నా వంతు సాయంగా స్థలాన్ని ఇచ్చాను’’ అని నజీర్‌ తెలిపారు. నజీర్‌ దాతృత్వం మతాల మధ్య సామరస్యం పెరిగేందుకు దోహదం చేస్తుందని పలువురు అభినందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని