ఫ్రిజ్‌లకు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు

గృహావసరాల కోసం వాడే ఫ్రిజ్‌ల ఇంధన వినియోగానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని కేంద్ర బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ సంస్థ పేర్కొంది.

Published : 07 Oct 2022 05:05 IST

మార్గదర్శకాలు జారీ

ఈనాడు, దిల్లీ: గృహావసరాల కోసం వాడే ఫ్రిజ్‌ల ఇంధన వినియోగానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని కేంద్ర బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ సంస్థ పేర్కొంది. ఇందుకు నిబంధనలను విడుదల చేస్తూ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక మీదట ప్రతి ఫ్రిజ్‌పై బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ లోగో, తయారీదారు లేదా దిగుమతిదారు పేరు, బ్రాండ్‌పేరు, దాని టైప్‌, మొత్తం సామర్థ్యం (వాల్యూమ్‌), మోడల్‌ నంబర్‌, తయారీ/ దిగుమతి చేసుకున్న సంవత్సరం, ప్రత్యేక విశిష్ట సంఖ్య (యునిక్‌ సిరీస్‌ కోడ్‌), ఏడాదికి ఎన్ని యూనిట్ల విద్యుత్తు ఖర్చు చేస్తుంది, స్టార్‌ లెవెల్‌, లేబుల్‌ పీరియడ్‌ అన్న వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలని నిర్దేశించింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన ఆరునెలల్లోపు ప్రతి ఫ్రిజ్‌పై ఈ వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని