సుప్రీంకోర్టు జడ్జీల నియామకంపై కొలీజియంలో తకరారు

సర్వోన్నత న్యాయస్థానానికి నలుగురు జడ్జీల పేర్లను సిఫారసు చేస్తూ.. వాటికి సమ్మతి తెలపాల్సిందిగా కొలీజియం సభ్యులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ రాసిన లేఖపై ఇద్దరు జడ్జీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Published : 07 Oct 2022 05:05 IST

లిఖితపూర్వక సమ్మతి తెలపాలని సీజేఐ లేఖ

అది సంప్రదాయం కాదంటూ ఇద్దరు సభ్యుల అభ్యంతరం

దిల్లీ: సర్వోన్నత న్యాయస్థానానికి నలుగురు జడ్జీల పేర్లను సిఫారసు చేస్తూ.. వాటికి సమ్మతి తెలపాల్సిందిగా కొలీజియం సభ్యులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ రాసిన లేఖపై ఇద్దరు జడ్జీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొలీజియం భేటీ భౌతికంగా జరగాలని, రాతపూర్వక సమ్మతిని కోరడం సమంజసం కాదని వారు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఆ నలుగురు జడ్జీల నియామకం ప్రశ్నార్థకమైంది. సీజేఐ నేతృత్వంలోని కొలీజియంలో జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ సభ్యులు. సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న నలుగురు న్యాయమూర్తుల స్థానానికి పేర్లు సిఫార్సు చేయడానికి గత నెల 29న కొలీజియం సమావేశమైంది. అయితే.. రాత్రి 9 గంటల వరకు కోర్టు విధులు నిర్వహిస్తూ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఆ భేటీకి హాజరుకాలేకపోయారు. దీంతో ఏ నిర్ణయమూ తీసుకోకుండానే సమావేశం ముగిసింది. మరుసటి రోజు సీనియర్‌ న్యాయవాది కె.వి.విశ్వనాథన్‌, పంజాబ్‌ హరియాణా, పట్నా, మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ రవిశంకర్‌ ఝా, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌ పేర్లను సుప్రీంకోర్టు జడ్జీలుగా సిఫార్సు చేస్తూ  కొలీజియం సభ్యులకు సీజేఐ లేఖ రాశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts