రూ.27 కోట్ల విలువైన వాచీ స్వాధీనం

దిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న ఏడు ఖరీదైన చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నారు.

Published : 07 Oct 2022 07:12 IST

దిల్లీ: దిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న ఏడు ఖరీదైన చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బంగారంతో తయారు చేసి వజ్రాలు పొదిగిన ఓ వాచీ విలువ రూ.27 కోట్లు కావడం గమనార్హం. రోలెక్స్‌ సహా ప్రముఖ సంస్థలకు చెందిన వాచీలు వీటిలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ 60 కిలోల బంగారంతో సమానం అని అధికారులు తెలిపారు. దుబాయ్‌ నుంచి వస్తున్న భారతీయ ప్రయాణికుడి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని