తదుపరి సీజేఐ పేరు ప్రతిపాదించండి

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును ప్రతిపాదించాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజూ ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌కు శుక్రవారం లేఖ రాశారు.

Published : 08 Oct 2022 04:05 IST

జస్టిస్‌ లలిత్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును ప్రతిపాదించాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజూ ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌కు శుక్రవారం లేఖ రాశారు. 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన ఈయన 74 రోజుల స్వల్ప పదవీకాలం అనంతరం నవంబరు 8న పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలో 50వ సీజేఐ పేరును ప్రతిపాదించాలని ప్రభుత్వం కోరింది. సీనియారిటీ పరంగా రెండోస్థానంలో ఉన్న జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తదుపరి సీజేఐగా నవంబరు 9న బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. 2024 నవంబరు 10 దాకా ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన మెమొరాండం ఆఫ్‌ ప్రొసీజర్‌ ప్రకారం వారసుల పేరును ప్రస్తుత సీజేఐ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏళ్ల వయసు నాటికి, హైకోర్టు న్యాయమూర్తులు 62 ఏళ్లకు పదవీ విరమణ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని