Maharashtra: 14 ఏళ్లకే రెండు డాక్టరేట్లు

మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన గీత్‌ పత్ని అరుదైన ఘనత సాధించింది. 14 ఏళ్ల వయసులోనే ప్రపంచంలోని రెండు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌ను సంపాదించింది. ‘ఫోన్‌ అధిక వినియోగం వల్ల పిల్లలపై పడే ప్రభావాలు’ అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకుగాను ఈ డాక్టరేట్‌లు వరించాయి.

Updated : 14 Oct 2022 06:48 IST

మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన గీత్‌ పత్ని అరుదైన ఘనత సాధించింది. 14 ఏళ్ల వయసులోనే ప్రపంచంలోని రెండు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌ను సంపాదించింది. ‘ఫోన్‌ అధిక వినియోగం వల్ల పిల్లలపై పడే ప్రభావాలు’ అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకుగాను ఈ డాక్టరేట్‌లు వరించాయి. ఏకకాలంలో రెండు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్‌ పొందిన అతి పిన్న వయస్కురాలిగా గీత్‌ పత్ని రికార్డు సాధించినట్లు ఆమె తల్లిదండ్రులు చెప్పారు. గీత్‌ పత్ని తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆ బాలిక యోగాలో మాస్టర్స్‌ పూర్తి చేయడమే కాకుండా.. అనేక మందికి శిక్షణ ఇస్తోంది. అయితే లాక్‌డౌన్‌ సమయంలో పిల్లల్లో ఫోన్‌ వాడకం మితిమీరడంతో వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతున్న విషయాన్ని గీత్‌ పత్ని గుర్తించింది. ఈ అంశంపై పరిశోధన పత్రాన్ని రూపొందించి ప్రపంచంలోని ఏడు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు పంపించింది. ఈ పత్రాలను పరిశీలించిన కొలంబియా, ఘనా విశ్వవిద్యాలయాలు.. గీత్‌కు డాక్టరేట్‌ను ప్రకటించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని