Diwali: కాజూ కలశ్‌.. మిఠాయి కేజీ రూ.20,000

దీపావళి వచ్చిందంటే మిఠాయిల దుకాణాల వారు రకరకాల మిఠాయిలు అందుబాటులోకి తెస్తుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఓ దుకాణం తయారు చేసిన మిఠాయిని కొనుగోలు చేయాలంటే మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.

Updated : 20 Oct 2022 06:47 IST

దీపావళి వచ్చిందంటే మిఠాయిల దుకాణాల వారు రకరకాల మిఠాయిలు అందుబాటులోకి తెస్తుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఓ దుకాణం తయారు చేసిన మిఠాయిని కొనుగోలు చేయాలంటే మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రత్యేక ‘కాజూ కలశ్‌’ మిఠాయి కేజీ రూ.20,000. పైన్‌ గింజలు, కశ్మీర్‌లో లభించే కిశోరీ పిస్తా, కుంకుమపువ్వు వంటివి తయారీలో ఉపయోగించడం వల్లే అంత ధర. అంతేకాకుండా 24 క్యారెట్ల బంగారాన్ని కూడా ఈ మిఠాయి తయారీలో ఉపయోగించడం విశేషం. ఈ ప్రత్యేకతల కారణంగానే తాము తయారుచేసిన ‘కాజూ కలశ్‌’కు మిగతా వాటితో పోల్చితే ప్రత్యేక రుచి లభిస్తుందని రోషన్‌లాల్‌ స్వీట్స్‌కు చెందిన రజత్‌ మహేశ్వరి చెప్పారు. ధర కారణంగా ఈ మిఠాయి అమ్మకాలు పెద్దగా ఉండకపోవచ్చునని, ప్రత్యేకతల కారణంగా కచ్చితంగా కొందరు ఖాతాదారులను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని