Fire Haircut: వికటించిన ఫైర్‌ హెయిర్‌కట్‌!

ఇటీవల ప్రాచుర్యం పొందిన ‘ఫైర్‌ హెయిర్‌కట్‌’ వికటించి, ఓ యువకుడికి తీవ్రస్థాయిలో కాలిన గాయాలయ్యాయి! గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లా వాపిలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ విధానంలో ముందుగా జుట్టుకు రసాయనం పూసి, మంట అంటిస్తారు.

Updated : 28 Oct 2022 06:48 IST

వల్సాద్‌: ఇటీవల ప్రాచుర్యం పొందిన ‘ఫైర్‌ హెయిర్‌కట్‌’ వికటించి, ఓ యువకుడికి తీవ్రస్థాయిలో కాలిన గాయాలయ్యాయి! గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లా వాపిలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ విధానంలో ముందుగా జుట్టుకు రసాయనం పూసి, మంట అంటిస్తారు. ఆ తర్వాత కోరుకున్న ఆకృతి వచ్చేలా క్షవరం చేస్తారు. 18 ఏళ్ల యువకుడు ఫైర్‌ హెయిర్‌కట్‌ చేయించుకునేందుకు బుధవారం ఓ క్షౌరశాలకు వెళ్లాడు. సెలూన్‌ యజమాని అతని జుట్టుకు నిప్పు అంటించగానే భారీగా మంటలు రేగాయి. వాటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా కొద్దిసేపటి వరకూ సాధ్యం కాలేదు. అప్పటికే ఆ యువకుడి తల, మెడ, ఛాతీ భాగాలకు మంటలు వ్యాపించి, తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతడిని వల్సాద్‌ సివిల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి నుంచి సూరత్‌లోని ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని