Karnataka: స్వర్ణ దోశ రూ.1001

సాధారణంగా దోశ ఖరీదు రూ.25 నుంచి రూ.75 వరకు ఉంటుంది. కానీ ఈ దోశ ఖరీదు ఏకంగా రూ.1001.

Updated : 03 Nov 2022 07:07 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: సాధారణంగా దోశ ఖరీదు రూ.25 నుంచి రూ.75 వరకు ఉంటుంది. కానీ ఈ దోశ ఖరీదు ఏకంగా రూ.1001. బంగారం వేసి చేశారా? అని అనుమానం వస్తుంది కదూ! అవును దోశపై బంగారు కాగితాన్ని అంటించి ఇచ్చే ‘గోల్డెన్‌ ఫాయిల్‌ ఎడిబుల్‌ మసాలా దోశ’ ఇది.

కర్ణాటకలోని తుమకూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న ఉడుపి శ్రీకృష్ణ భోజనాలయానికి వెళితే ఈ ఖరీదైన దోశను తినవచ్చు. మొదట్లో వారానికి ఒకటో రెండో దోశలకు ఆర్డర్లు వచ్చేవని, ప్రస్తుతం రోజుకు రెండు మూడు ఆర్డర్లు వస్తున్నాయని హోటల్‌ యజమాని కార్తిక్‌ తెలిపారు. రూ.800 విలువైన సిల్వర్‌ ఫాయిల్‌ దోశ కూడా తయారు చేస్తున్నామని చెప్పారు. సంప్రదాయక అల్పాహారంతో పాటు పనస గుజ్జుతో చేసిన కేసరి బాత్‌, మంగళూరు బన్స్‌ కోసం తమ హోటల్‌కు ఆహార ప్రియులు ఎక్కువగా వస్తుంటారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని