Crime News: చీరలు, బూట్లలో రూ.4కోట్లు.. ముంబయి విమానాశ్రయంలో పట్టివేత

ముంబయి విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్‌ వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భారతీయుల నుంచి 4,97,000 డాలర్ల (సుమారు రూ.4.1 కోట్లు) నగదును కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 04 Nov 2022 06:56 IST

ముంబయి విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్‌ వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భారతీయుల నుంచి 4,97,000 డాలర్ల (సుమారు రూ.4.1 కోట్లు) నగదును కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం పక్కా సమాచారం అందుకున్న అధికారులు నిందితులను అడ్డగించి తనిఖీలు చేశారు. బ్యాగులో చీరల మధ్య, బూట్ల సోల్‌లో దాచిన నగదు బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని