Ceiling fan: ఆ పరికరం వాడితే ఫ్యానుకు ఉరేసుకోలేరు

తాము ఉత్పత్తి చేస్తున్న ఒక పరికరాన్ని వాడితే సీలింగ్‌ ఫ్యానుకు ఉరి తాడు బిగించి వేళ్లాడినా అది మరణానికి దారి తీయదని చెబుతోంది ఓ కంపెనీ.

Updated : 04 Nov 2022 08:30 IST

ఈనాడు, బెంగళూరు: తాము ఉత్పత్తి చేస్తున్న ఒక పరికరాన్ని వాడితే సీలింగ్‌ ఫ్యానుకు ఉరి తాడు బిగించి వేళ్లాడినా అది మరణానికి దారి తీయదని చెబుతోంది ఓ కంపెనీ. ప్రముఖ ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ సేఫ్‌ హోలో తయారు చేసిన ఓ ఫ్యాన్‌ డివైజ్‌ను (పరికరం) వినియోగిస్తే ఆత్మహత్యలకు పాల్పడటం సాధ్యపడదు.

ఈ వినూత్న ఉత్పత్తిని బెంగళూరులో నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సమావేశంలో ప్రదర్శించారు. సేఫర్‌ ఫ్యాన్‌ పేరిట రూపొందించిన ఈ డివైజ్‌లో అమర్చిన సేఫ్‌ క్లాంప్‌లో ఉన్న స్ప్రింగ్‌... 20 కిలోల కంటే ఎక్కువ బరువున్న వస్తువు వేలాడుతూ నిదానంగా జారిపోతుంది. పైగా ఇందులో అమర్చిన అలారం బరువైన వస్తువులు వేలాడితే పెద్దగా మోగుతుంది. పైకప్పునకు నేరుగా ఈ సేఫర్‌ క్లాంప్‌తో ఫ్యాన్‌ను బిగిస్తే చాలని సంస్థ టెక్నికల్‌ డైరెక్టర్‌ సుమంత్‌ తెలిపారు. వీటిని ఇప్పటికే 1.2 లక్షలు విక్రయించినట్లు ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని