ఆడ శిశువు పుడితే అక్కడ ప్రసవ ఖర్చులు ఉచితం.. 2400 మందికి హెల్ప్‌ చేసిన డాక్టర్‌

ఆ ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే ఘనమైన స్వాగతం పలుకుతారు. అంతే కాదు.. ఒక్క రూపాయి వసూలు చేయకుండా వైద్య ఖర్చులు మొత్తాన్ని ఆసుపత్రే భరిస్తుంది.

Updated : 07 Nov 2022 07:06 IST

పుణె: ఆ ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే ఘనమైన స్వాగతం పలుకుతారు. అంతే కాదు.. ఒక్క రూపాయి వసూలు చేయకుండా వైద్య ఖర్చులు మొత్తాన్ని ఆసుపత్రే భరిస్తుంది. ‘బేటీ బచావో జనాందోళన్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ సేవలు అందిస్తున్నట్లు పుణెకి చెందిన డాక్టర్‌ గణేశ్‌ రఖ్‌ తెలిపారు. మహారాష్ట్రలోని హరిదాప్సార్‌ ప్రాంతంలో ప్రజల్లో భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు తన ఆసుపత్రిలో ఉచితంగా ప్రసవాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత 11 ఏళ్లల్లో సుమారు 2,400 మందికి ఇలా చేసినట్లు వెల్లడించారు. ‘2012 కంటే ముందు ఈ ప్రాంతంలో ఆడ శిశువు పుడితే ఆ పిల్లను చూసేందుకు కుటుంబ సభ్యులు కూడా వచ్చేవారు కాదు. ఇది నన్ను కలచివేసింది. లింగ వివక్ష తగదనే అవగాహన కల్పించేందుకు అదే నన్ను ప్రేరేపించింది’ అని ఆయన తెలిపారు. తాను మొదలు పెట్టిన కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు, ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు సైతం విస్తరించిందని సంతోషం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని