గుంతలు లేని చోటు చూపించు మోదీజీ..

గుంతలమయమైన రహదారిపై నిరసన వ్యక్తం చేయడానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ విశ్రాంత సైనికుడు వినూత్న ప్రదర్శన చేపట్టారు.

Published : 08 Nov 2022 06:50 IST

గుంతలమయమైన రహదారిపై నిరసన వ్యక్తం చేయడానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ విశ్రాంత సైనికుడు వినూత్న ప్రదర్శన చేపట్టారు. ఖేకడాకు చెందిన విశ్రాంత సైనికుడు సుభాష్‌ చంద్‌ కశ్యప్‌ పట్టపగలు చేతిలో లాంతరు, ప్రధాని మోదీ ముఖంతో ఉన్న మాస్కు పట్టుకుని ఖేకడా నుంచి గాజియాబాద్‌ వరకు దాదాపు 30 కి.మీ. కాలి నడకన రహదారిపై గుంతలు లేని చోటును వెతుక్కుంటూ వెళ్లారు. దిల్లీ-సహరాన్‌పుర్‌ జాతీయ రహదారిపై గత కొన్ని రోజులుగా పనులు జరుగుతున్నాయి. దీని వల్ల రోడ్డుపై మొత్తం గుంతలు ఏర్పడ్డాయి. ఆ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఈ నిరసన చేపట్టినట్లు కశ్యప్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని