32 లక్షల వివాహాలు!

దేశవ్యాప్తంగా నవంబరు 4 నుంచి డిసెంబరు 14 మధ్య సుమారు 32 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లు అఖిల భారత వర్తకుల సమాఖ్య(కెయిట్‌) అంచనా కట్టింది.

Published : 08 Nov 2022 06:28 IST

 డిసెంబరు 14 లోపు దేశంలో జరుగుతాయని అంచనా

దిల్లీ: దేశవ్యాప్తంగా నవంబరు 4 నుంచి డిసెంబరు 14 మధ్య సుమారు 32 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లు అఖిల భారత వర్తకుల సమాఖ్య(కెయిట్‌) అంచనా కట్టింది. వీటిపై రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. గత ఏడాది ఇదే సమయంలో సుమారు 25 లక్షల పెళ్లిళ్లు, రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిపింది. తమ పరిశోధన బృందం నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాల ఆధారంగా తాజా అంచనాకు వచ్చినట్లు చెప్పింది. 35 నగరాల్లో 4,302 మంది వ్యాపారులు, సేవా సంస్థల నుంచి వివరాలు సేకరించినట్లు వెల్లడించింది. దిల్లీ ప్రాంతంలోనే 3.5 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని, వీటిపై సుమారు రూ.75,000 కోట్ల వ్యాపారం నడవవచ్చని కెయిట్‌ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ తెలిపారు. తదుపరి వివాహ సీజను జనవరి 14 నుంచి ప్రారంభమై జులై వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని