అంగవైకల్యాన్ని ఓడించిన యువతి.. యూజీసీ-నెట్‌లో 99.31 శాతం స్కోర్‌

పక్కవారి సహాయం లేకపోతే అడుగు కూడా వేయలేదు. కానీ తన సంకల్పంతో.. అక్షరాలను అందిపుచ్చుకుని ఎంతో ఎత్తుకు ఎదిగింది.

Updated : 09 Nov 2022 07:43 IST

పక్కవారి సహాయం లేకపోతే అడుగు కూడా వేయలేదు. కానీ తన సంకల్పంతో.. అక్షరాలను అందిపుచ్చుకుని ఎంతో ఎత్తుకు ఎదిగింది. అంగవైకల్యాన్ని అధిగమించిన ఆ అమ్మాయి.. జాతీయ అర్హత పరీక్ష (నెట్‌)లో 99.31 శాతం స్కోర్‌ సాధించి ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమబెంగాల్‌ నదియా జిల్లా శాంతిపుర్‌కు చెందిన పియాషా మహల్దార్‌ పుట్టుకతోనే దివ్యాంగురాలు. 3 అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. బాల్యం నుంచి తనంతట తానుగా కదలలేని పరిస్థితి. అయినా సరే పియాషాకు చదువంటే చాలా ఆసక్తి. పాఠశాల, కళాశాల స్థాయిలోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. యూజీసీ నిర్వహించిన నెట్‌ను కంప్యూటర్‌ ముందు బోర్లా పడుకుని రాసింది. సోమవారం ఫలితాలు వెలువడగా.. బెంగాలీ విభాగంలో 99.31 శాతం స్కోర్‌ సాధించింది పియాషా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని