Shirdi: అందరికీ శిర్డీ సాయి సమాధి స్పర్శ దర్శనం

మహారాష్ట్రలోని శిర్డీ వెళ్లే భక్తులు సాయినాథుణ్ని దర్శనం చేసుకోవడంతో బాబా సమాధిని స్పృశించే భాగ్యాన్ని తిరిగి పొందనున్నారు.

Updated : 11 Nov 2022 06:50 IST

శిర్డీ: మహారాష్ట్రలోని శిర్డీ వెళ్లే భక్తులు సాయినాథుణ్ని దర్శనం చేసుకోవడంతో బాబా సమాధిని స్పృశించే భాగ్యాన్ని తిరిగి పొందనున్నారు. ఒకప్పుడు ప్రతి భక్తునికీ ఈ అవకాశం ఉండేది. తీవ్ర రద్దీ నేపథ్యంలో శిర్డీ సాయి సంస్థాన్‌ మార్పులు చేసింది. భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టింది. వీఐపీ భక్తులకు మాత్రమే బాబా దగ్గరకు వెళ్లి ఆ సమాధిని తాకే అదృష్టం దక్కేది. సాధారణ భక్తులు దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు సామాన్యులకూ సాయి సమాధిని తాకే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సాయి సంస్థాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి భాగ్యశ్రీ బనాయత్‌ తెలిపారు. భక్తుల కోరిక మేరకు సాయి సచ్చరిత్రను వివిధ భాషల్లో ప్రచురించే ప్రణాళికలో ఉన్నామని వివరించారు. ఈ నిర్ణయాలపై శిర్డీ గ్రామస్థులతో పాటు సాయి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని