అధికారిక గుర్తుపై ట్విటర్‌ వెనక్కి

బ్లూటిక్‌ తరహాలోనే ప్రభుత్వంలోని ముఖ్య వ్యక్తులను గుర్తించేందుకు ‘అధికారిక’ గుర్తును ప్రకటించిన ట్విటర్‌..

Published : 11 Nov 2022 04:31 IST

కొన్ని గంటల్లోనే ఉపసంహరణ

దిల్లీ: బ్లూటిక్‌ తరహాలోనే ప్రభుత్వంలోని ముఖ్య వ్యక్తులను గుర్తించేందుకు ‘అధికారిక’ గుర్తును ప్రకటించిన ట్విటర్‌.. అది ప్రారంభించిన కొన్ని గంటల్లోనే వెనక్కి తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు మంత్రుల ట్విటర్‌ ఖాతాలకు బుధవారం బ్లూటిక్‌కు అదనంగా ‘అధికారిక’ (అఫీషియల్‌) పేరుతో ఓ గుర్తును చేర్చింది. అయితే ఈ గుర్తు చాలా మంది ప్రభుత్వేతర వ్యక్తుల ఖాతాల్లోనూ కనిపించడంతో గందరగోళం నెలకొంది. దీంతో కొన్ని గంటల్లోనే ‘అధికారిక’ గుర్తును వెనక్కి తీసుకుంటున్నట్లు ట్విటర్‌ ప్రకటించింది. ఈ సామాజిక మాధ్యమ సంస్థను కొనుగోలు చేసిన అమెరికా కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా కొత్త గుర్తుతో ఆశించిన ఫలితాలు రాలేదని, అందుకే ఉపసంహరించుకుంటున్నామని తెలిపారు. అయితే రానున్న రోజుల్లో ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు చాలా తీసుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని