Shahrukh khan: ముంబయి ఎయిర్‌పోర్టులో షారుక్‌కు చేదు అనుభవం

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌కు ముంబయి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన బృందానికి చెందిన లగేజీలో ఖరీదైన వాచీలు బయటపడటంతో కస్టమ్స్‌ అధికారులు అడ్డుకున్నారు.

Updated : 13 Nov 2022 08:10 IST

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌కు ముంబయి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన బృందానికి చెందిన లగేజీలో ఖరీదైన వాచీలు బయటపడటంతో కస్టమ్స్‌ అధికారులు అడ్డుకున్నారు. దీంతో షారుక్‌ గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత షారుక్‌ తరఫున ఆయన బాడీగార్డు కస్టమ్స్‌ సుంకం చెల్లించారు. షారుక్‌తో పాటు ఆయన మేనేజర్‌ పూజా దద్లానీ, బాడీగార్డ్‌ రవిశంకర్‌ సింగ్‌, మరో ముగ్గురు సిబ్బంది దుబాయి నుంచి ప్రైవేట్‌ జెట్‌లో బయల్దేరి శుక్రవారం అర్ధరాత్రి ముంబయి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టగా.. వారి బ్యాగుల్లో రూ.18లక్షల విలువ చేసే ఆరు ఖరీదైన వాచీలను కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. దీంతో షారుక్‌, అతని సిబ్బందిని అధికారులు అడ్డుకుని గంటపాటు విచారించారు. ఆ తర్వాత బాడీగార్డు రవిశంకర్‌ మినహా షారుక్‌, అతడి సిబ్బందిని ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయేందుకు అధికారులు అనుమతించారు. షారుక్‌ తరఫున బాడీగార్డు రవిశంకర్‌ రూ.6.83లక్షల కస్టమ్స్‌ సుంకం చెల్లించినట్లు అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని