శ్రీశ్రీ రవిశంకర్‌కు గాంధీ పురస్కారం ప్రదానం

ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ అట్లాంటాలో గాంధీ పీస్‌ పిలిగ్రిమ్‌ పురస్కారం అందుకున్నారు.

Updated : 13 Nov 2022 23:04 IST

వాషింగ్టన్‌: ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ అట్లాంటాలో గాంధీ పీస్‌ పిలిగ్రిమ్‌ పురస్కారం అందుకున్నారు. మహాత్మాగాంధీ, డా.మార్టిన్‌ లూథర్‌ కింగ్‌లు ప్రబోధించిన శాంతి, అహింసా సిద్ధాంతాల వ్యాప్తికి అలుపెరుగని కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా ఆయన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అల్లుడు ఇసాక్‌ ఫెర్రీస్‌, అట్లాంటాలో భారత్‌ కాన్సుల్‌ జనరల్‌ డా.స్వాతి కులకర్ణి సమక్షంలో అమెరికాలోని గాంధీ ఫౌండేషన్‌ ఈ పురస్కారాన్ని శ్రీశ్రీ రవిశంకర్‌కు అందజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని