Electric kick: పాత పెట్రోల్‌ వాహనాలకు.. ఎలక్ట్రిక్‌ కిక్‌

రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. పాత పెట్రోల్‌ స్కూటర్‌, బైక్‌లను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మారుస్తోంది.

Published : 14 Nov 2022 08:02 IST

రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. పాత పెట్రోల్‌ స్కూటర్‌, బైక్‌లను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మారుస్తోంది. జోధ్‌పుర్‌లో జరుగుతున్న హరే డిజిఫెస్ట్‌లో ఈ వాహనాన్ని ఆవిష్కరించింది. ‘‘పాత స్కూటర్‌ను, కొత్త ఎలక్ట్రిక్‌ వాహనంగా ఎందుకు మార్చకూడదు అనే ఆలోచన నాలో వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని నా పిల్లలతో చెప్పాను. వారు బాగా శ్రమించి పాత స్కూటర్‌ను ఎలక్ట్రిక్‌ వాహనంగా మార్చారు. ఇది విజయవంతం కావడంతో మరిన్ని పాత మోటార్‌ సైకిళ్లను కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చాం’’ అని కంపెనీ వ్యవస్థాపకురాలు మధు కిరోడీ తెలిపారు. ఇందుకు రూ. 30వేలు ఖర్చు అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని.. ఇందుకు దాదాపు రూ.6 ఖర్చవుతుందని మధు కిరోడీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని