Para Jump: 70 ఏళ్ల వయసులో పారాజంప్‌!

సాధించాలి అనే తపన ఉంటే అసాధ్యమైనదంటూ ఏమీ లేదని 70 ఏళ్ల రిటైర్డ్‌ కర్నల్‌ గిరిజా శంకర్‌ ముంగలి నిరూపించారు.

Updated : 09 Dec 2022 15:29 IST

సాధించాలి అనే తపన ఉంటే అసాధ్యమైనదంటూ ఏమీ లేదని 70 ఏళ్ల రిటైర్డ్‌ కర్నల్‌ గిరిజా శంకర్‌ ముంగలి నిరూపించారు. ఏడు పదుల వయసులో 1,600 అడుగుల ఎత్తు నుంచి పారా జంపింగ్‌ చేసి, సరికొత్త రికార్డు సృష్టించారు. నైనితాల్‌కు చెందిన ఆయన ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి మహారాష్ట్రలోని పుణెలో నివసిస్తున్నారు. ఆగ్రాలో అక్టోబరు 15న నిర్వహించిన పారాజంప్‌లో గిరిజా ముంగలి పాల్గొని 1,600 అడుగుల పైనుంచి కిందికి దూకి రికార్డు సృష్టించారు. 35 మంది సభ్యులు కలిగిన గ్రూప్‌లో సభ్యునిగా ఈ పారాజంప్‌లో పాల్గొన్నారు. ఈ గ్రూప్‌లో అధిక సంఖ్యలో వృద్ధులే ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని