Life Support: వెంటిలేటర్‌ తీస్తే ఆ చిన్నారి దక్కదు.. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆసుపత్రే ఇల్లుగా మారిపోయింది. ఐదేళ్లుగా  వెంటిలేటర్‌పై ఉంటూ ప్రతి క్షణం చావుతో పోరాడుతోంది. ఝార్ఖండ్‌కు చెందిన సౌమిలి తివారి అనే చిన్నారి విషాదగాథ ఇది. 

Updated : 16 Nov 2022 08:38 IST

రుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆసుపత్రే ఇల్లుగా మారిపోయింది. ఐదేళ్లుగా  వెంటిలేటర్‌పై ఉంటూ ప్రతి క్షణం చావుతో పోరాడుతోంది. ఝార్ఖండ్‌కు చెందిన సౌమిలి తివారి అనే చిన్నారి విషాదగాథ ఇది. ఆమెకు రెండున్నరేళ్ల వయసున్నప్పుడు 2017లో శ్వాస సంబంధిత సమస్యలతో కోల్‌కతాలోని ముకుందాపుర్‌ ఏఎమ్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చేరింది. పరీక్షల్లో మెడలో కణితి ఉందని తేలింది. దీన్నే వైద్య పరిభాషలో న్యూరోసైగ్లోమెట్రోసిస్‌ అంటారు. ఈ వ్యాధి వచ్చిన వారికి నరంపై కణితి పెరుగుతుంది. ఈ చిన్నారికి అలా కణితి పెరిగి ఆమె పుర్రె దెబ్బతింది. దీంతో ఆమె శరీరం భుజాల నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయింది. దీనికి తోడు ఆమెకు శ్వాస సమస్య కూడా తోడైంది. దీంతో ఆమెను అయిదేళ్లుగా వెంటిలేటర్‌పైనే ఉంచారు. అది తీసేస్తే రెండు నిమిషాల్లో చిన్నారి చనిపోతుంది. ప్రస్తుతం సౌమిలి.. ఆసుపత్రి, పీడియాట్రిక్‌ ఐసీయూ విభాగాధిపతి డాక్టర్‌ సౌమెన్‌ మీర్‌ పర్యవేక్షణలో ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. మిగతా చిన్నారుల్లాగా ఆ చిన్నారి నవ్వలేదని, ఆడుకోలేదని మీర్‌ ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని