Nitin Yadav: ఆయన ‘స్కెచ్‌’కు ఎలాంటి నేరస్థులైనా చిక్కాల్సిందే..

ఆయన ‘స్కెచ్‌’ వేశారంటే ఎలాంటి నేరస్థులైనా పోలీసుల వలలో చిక్కాల్సిందే.. నిందితుల ఆనవాళ్లు చెబితే చాలు.. వారి ముఖాలను అచ్చు గుద్దినట్లు దించేస్తారాయన.

Updated : 21 Nov 2022 08:33 IST

ఆయన ‘స్కెచ్‌’ వేశారంటే ఎలాంటి నేరస్థులైనా పోలీసుల వలలో చిక్కాల్సిందే.. నిందితుల ఆనవాళ్లు చెబితే చాలు.. వారి ముఖాలను అచ్చు గుద్దినట్లు దించేస్తారాయన. ఇప్పటివరకు 500 మంది నేరస్థులను పట్టుకోవడంలో పోలీసులకు సాయం చేశారు. ఆయనే క్యారికేచర్‌ ఆర్టిస్ట్‌ నితిన్‌ యాదవ్‌. మహారాష్ట్రలోని ముంబయికి చెందిన నితిన్‌.. ఇప్పటివరకు 4 వేలకు పైగా స్కెచ్‌లు గీశారు.

సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను   గుర్తు పట్టలేని కేసుల్లోనూ.. ఆయన పక్కాగా వారి ముఖాలను గీసేస్తారు. కొన్నిసార్లు నేరస్థులు ఫోన్‌ చేసి నితిన్‌ను బెదిరించినా ఆయన భయపడలేదు. 2013లో ముంబయిలో సంచలనం రేపిన శక్తి మిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసును ఛేదించేందుకు పోలీసులు నితిన్‌ను ఆశ్రయించారు. ఈ కేసులో నితిన్‌ గీసిన స్కెచ్‌ల ద్వారానే నిందితులను పట్టుకున్నారు. 2012లో బాంద్రాలో విదేశీ యువతిపై జరిగిన అత్యాచార కేసును, 2010లో పుణెలోని జర్మన్‌ బేకరీ బాంబు దాడి కేసులోనూ నితిన్‌ సాయం వల్లే నేరస్థులను అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని