ఏనుగును పెంచుతున్నారంటూ ఎమ్మెల్యేపై దాడి
ఎమ్మెల్యే పెంచుతున్న ఏనుగు తమను తొక్కి చంపుతోందంటూ కొందరు గ్రామస్థులు... ఆయనపై దాడికి పాల్పడ్డారు.
చిక్కమగళూరు, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే పెంచుతున్న ఏనుగు తమను తొక్కి చంపుతోందంటూ కొందరు గ్రామస్థులు... ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హుల్లేమనె కుందూరు గ్రామానికి చెందిన సతీశ్‌గౌడ, శోభ భార్యాభర్తలు.
పశువుల గడ్డి కోసుకొచ్చేందుకు ఆదివారం ఉదయం ఇద్దరూ గ్రామ సమీపంలోని పొలానికి వెళ్లారు. అక్కడ ఏనుగు దాడిచేసి శోభను చంపేసింది. పరిహారం ఇవ్వాలని అటవీశాఖ సిబ్బందిని కోరుతూ శోభ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం రాత్రి దాకా ధర్నా చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మూడిగెరె భాజపా ఎమ్మెల్యే ఎం.పి.కుమారస్వామి బాధితులను పరామర్శించేందుకు రాత్రి 7 గంటలకు గ్రామానికి వెళ్లారు. ఎమ్మెల్యే ఏనుగును పెంచుతున్నారని, అది స్థానికులపై దాడి చేస్తోందని ఆరోపిస్తూ గ్రామస్థులు కొందరు కుమారస్వామిని చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. స్థానికులపై పోలీసులు లాఠీఛార్జి చేసి, ఎమ్మెల్యేను రక్షించి, జీపు ఎక్కించి పంపించారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన శోభ అంత్యక్రియలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. వంద మందికిపైగా అనుచరులు, పోలీసు భద్రత నడుమ అంత్యక్రియలు ముగిసేదాకా గ్రామంలో ఉండి తిరిగి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన
-
ODI WC 2023: భారత స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులు జాగ్రత్త: పాక్ మాజీ కెప్టెన్
-
UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
-
Elections: అభ్యర్థుల నేర చరిత్రను.. పత్రికా ప్రకటనల్లో వెల్లడించాలి : ఎన్నికల సంఘం
-
World Culture Festival: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం 180 దేశాల ప్రజల ప్రార్థన
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి