ఒంటి నిండా రోమాలు.. తోడేలును తలపించేలా ముఖం: యువకుడికి అత్యంత అరుదైన వ్యాధి

ఒళ్లంతా వెంట్రుకలు.. ముఖాన్ని కప్పేసేలా రోమాలు.. చూడగానే భయం కలిగించే తోడేలు లాంటి రూపం.. అత్యంత అరుదుగా వచ్చే వేర్‌ఉల్ఫ్‌ సిండ్రోమ్‌ వ్యాధి లక్షణాలివి.

Updated : 25 Nov 2022 07:12 IST

ఒళ్లంతా వెంట్రుకలు.. ముఖాన్ని కప్పేసేలా రోమాలు.. చూడగానే భయం కలిగించే తోడేలు లాంటి రూపం.. అత్యంత అరుదుగా వచ్చే వేర్‌ఉల్ఫ్‌ సిండ్రోమ్‌ వ్యాధి లక్షణాలివి. మధ్యప్రదేశ్‌ రత్లాం జిల్లాలోని నంద్లేటా గ్రామానికి చెందిన లలిత్‌ పాటిదార్‌ అనే 17 ఏళ్ల యువకుడు ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. తల నుంచి కాలిగోటి వరకు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వెంట్రుకలతో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 50 మందికి మాత్రమే ఈ వ్యాధి వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ సిండ్రోమ్‌ ఉన్నవారికి ఒళ్లంతా వెంట్రుకలు పెరుగుతాయి. ఎన్నిసార్లు కత్తిరించినా మళ్లీ వెంట్రుకలు వస్తుంటాయి. లలిత్‌ పుట్టినప్పుడే ఒళ్లంతా వెంట్రుకలు ఉండేవి. సాధారణ రోమాలే అనుకొన్న వైద్యులు.. అప్పుడే వాటిని తొలగించారు. కానీ ఏడేళ్లు వచ్చేసరికి లలిత్‌ శరీరం అంతా వెంట్రుకలు పెరిగాయి. అతడి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా వేర్‌వుల్ఫ్‌ సిండ్రోమ్‌ వ్యాధి ఉందని తెలిసింది. మొదట్లో తన రూపం చూసి పిల్లలు భయపడేవారని, రాళ్లతో కొట్టేవారని లలిత్‌ చెప్పాడు. ఈ వ్యాధికి చికిత్స లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని