అమితాబ్ గళం, ఫొటో అనధికారికంగా వాడొద్దు
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (80) వ్యక్తిగత హక్కులపై దిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అమితాబ్ గళం, ఫొటో, పేరు సహా ఆయనకు సంబంధించిన మరే ఇతర గుర్తులను అనుమతి లేకుండా ఉపయోగించడాన్ని నిరోధిస్తూ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దిల్లీ హైకోర్టు ఆదేశాలు
దిల్లీ: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (80) వ్యక్తిగత హక్కులపై దిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అమితాబ్ గళం, ఫొటో, పేరు సహా ఆయనకు సంబంధించిన మరే ఇతర గుర్తులను అనుమతి లేకుండా ఉపయోగించడాన్ని నిరోధిస్తూ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమితాబ్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న వివరాలు తొలగించాలని టెలికాం శాఖ అధికారులు, సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. ‘కేబీసీ’ లాటరీ వెనుక ఉన్న వ్యక్తులతో సహా అనేకమంది తన ప్రచార హక్కులను దోపిడీ చేశారని ఆరోపిస్తూ అమితాబ్ వేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘కొందరు టీ-షర్టులు తయారుచేసి అమితాబ్ ఫొటో వేస్తున్నారు. మరికొందరు పోస్టర్లు విక్రయిస్తున్నారు. ఇంకొందరైతే అమితాబ్‌బచ్చన్.కామ్ అంటూ డొమైన్ రూపొందించి వెబ్సైట్ కూడా పెట్టేశారు’’ అని అమితాబ్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు నివేదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్