మహారాష్ట్ర గ్రామానికి 26/11 దాడి అమరుడి పేరు

పద్నాలుగేళ్ల కిందట జరిగిన ముంబయి ఉగ్ర దాడి (26/11)లో అమరుడైన జవాను రాహుల్‌ శిందే పేరును ఆయన స్వగ్రామానికి పెట్టారు.

Updated : 26 Nov 2022 05:06 IST

ముంబయి: పద్నాలుగేళ్ల కిందట జరిగిన ముంబయి ఉగ్ర దాడి (26/11)లో అమరుడైన జవాను రాహుల్‌ శిందే పేరును ఆయన స్వగ్రామానికి పెట్టారు. మహారాష్ట్రలోని సోలాపుర్‌ జిల్లా సుల్తాన్‌పూర్‌లో 600 ఇళ్లు ఉంటాయి. అమర జవాను పుట్టి పెరిగిన ఈ గ్రామం పేరును రాహుల్‌ నగర్‌గా మార్పు చేశారు. ప్రభుత్వ లాంఛనాలు పూర్తి కావాల్సి ఉంది. స్టేట్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్సు (ఎస్‌ఆర్‌పీఎఫ్‌)లో కానిస్టేబుల్‌ అయిన రాహుల్‌ తాజ్‌మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌లోకి ముందుగా ప్రవేశించగా.. ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు. పొట్టలోకి తూటా దూసుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ‘రాహుల్‌ తల్లి ఇప్పటికీ కోలుకోలేదు. కుమారుడు మృతిచెందిన విషయాన్ని నమ్మలేకపోతున్నారు. ప్రభుత్వపరంగా నిబంధనల ప్రకారం అందాల్సిన సాయం మాకు అందింది’ అని తండ్రి సుభాష్‌ విష్ణు శిందే తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని