ట్రీ లైబ్రరీగా తాగుబోతుల అడ్డా

పశ్చిమబెంగాల్‌ చలపాయ్‌గుడీ గ్రామంలో ఓ చెట్టుకింద సాగుతున్న జూదం, మద్యపాన కార్యకలాపాలను ట్రీ లైబ్రరీ ఏర్పాటుతో నిలువరించి సమరిటన్‌ నిమేష్‌ లామా అనే వ్యక్తి వార్తల్లో నిలిచారు.

Published : 26 Nov 2022 05:02 IST

పశ్చిమబెంగాల్‌ చలపాయ్‌గుడీ గ్రామంలో ఓ చెట్టుకింద సాగుతున్న జూదం, మద్యపాన కార్యకలాపాలను ట్రీ లైబ్రరీ ఏర్పాటుతో నిలువరించి సమరిటన్‌ నిమేష్‌ లామా అనే వ్యక్తి వార్తల్లో నిలిచారు. స్థానిక యూరోపియన్‌ ఫీల్డ్‌ అనే ప్రదేశంలో గల ఓ చెట్టు కింద అనేక మంది జూదం ఆడుతూ మద్యపానం చేసేవారు. ఒకసారి అక్కడకు వచ్చిన నిమేష్‌ లామా ఆ పరిస్థితిని మార్చాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా తన స్నేహితులతో కలిసి చెట్టు వద్దకు గిటార్‌, పుస్తకాలతో వెళ్లడం ప్రారంభించారు. తరువాత చెట్టు చుట్టూ లైబ్రరీని ఏర్పాటు చేశారు. దానికి ట్రీ లైబ్రరీ అని పేరు పెట్టారు. దీంతో ఎంతో మంది అక్కడకు వచ్చి తమ ఆలోచనలు మెరుగుపరుచుకుంటున్నారు. ప్రతి ఆదివారం ఆర్ట్‌ హంట్‌ నిర్వహిస్తారు. చాలా మంది చిన్నారులు అక్కడికి వచ్చి గిటార్‌ ప్లే చేయటం, పాటలు పాడటం, పెయింటింగ్స్‌ వేయటం వంటి పోటీలలో పాల్గొంటున్నారు. దీంతో క్రమంగా ఆ ప్రాంతంలో చట్ట విరుద్ధ కార్యక్రమాలను నిలిచిపోయాయి. దీనిపై గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను చదివిన ఓ నవలతో తనకు ఈ ప్రేరణ వచ్చిందని నిమేష్‌ అన్నారు. ఆయన 2021లో జోయ్‌గర్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం డబ్ల్యూబీసీఎస్‌ కోసం సిద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని