మద్యం కుంభకోణంలో ఈడీ ఛార్జిషీట్‌

ఉత్కంఠ రేపుతున్న దిల్లీ మద్యం కుంభకోణంలో ఇండో స్పిరిట్‌ కంపెనీ యజమాని సమీర్‌ మహేంద్రును ఏ1గా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

Updated : 27 Nov 2022 06:07 IST

ఏ1గా సమీర్‌ మహేంద్రు

ఈనాడు, దిల్లీ: ఉత్కంఠ రేపుతున్న దిల్లీ మద్యం కుంభకోణంలో ఇండో స్పిరిట్‌ కంపెనీ యజమాని సమీర్‌ మహేంద్రును ఏ1గా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. మూడువేల పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌కు శనివారం సమర్పించింది. కుంభకోణంలో రూ.291 కోట్ల నగదు లావాదేవీలను గుర్తించినట్టు అందులో పేర్కొంది. కస్టడీలో ఉన్న సమీర్‌ను అధికారులు ఈ సందర్భంగా కోర్టులో హాజరుపరిచారు. ఆయన డైరెక్టరుగా ఉన్న, లబ్ధిపొందిన సంస్థలను ఏ2, ఏ3, ఏ4, ఏ5లుగా ఈడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే విషయమై డిసెంబరు 12న నిర్ణయం చెబుతామని ప్రత్యేక న్యాయమూర్తి పేర్కొన్నారు. అప్పటివరకూ సమీర్‌ జ్యుడీషియల్‌ రిమాండును పొడిగించారు.

* దర్యాప్తు పేరుతో తననూ, తన భర్తనూ ఈడీ అధికారులు వేధిస్తున్నారంటూ... సమీర్‌ మహేంద్రు భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి విజయ్‌నాయర్‌ జ్యుడీషియల్‌ కస్టడీని మరో 13 రోజులు పొడిగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని