అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు రావాలి: అమితాబ్‌ కాంత్‌

అంతర్జాతీయ సంస్థలన్నింటిలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందనీ, ఉమ్మడి లక్ష్యాలను చేరుకునేలా వేర్వేరు దేశాల కూటములు పాటుపడాలని నీతి ఆయోగ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు.

Published : 27 Nov 2022 03:52 IST

పోర్ట్‌బ్లెయిర్‌: అంతర్జాతీయ సంస్థలన్నింటిలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందనీ, ఉమ్మడి లక్ష్యాలను చేరుకునేలా వేర్వేరు దేశాల కూటములు పాటుపడాలని నీతి ఆయోగ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. జి-20 కూటమి సారథ్య బాధ్యతల్ని భారత్‌ చేపట్టబోతున్న తరుణంలో శనివారం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని హేవ్‌లాక్‌ ఐలాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రాధాన్యాలు సమ్మిళితంగా ఉండాలనీ, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు నిధుల సమీకరణలో సుస్థిర అభివృద్ధి సాధించాలని కాంత్‌ చెప్పారు. జి-20 సారథ్యంపై బ్రిటన్‌, రష్యా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల దౌత్యవేత్తలకు ఆయన వివరించారు. సంస్కరణలు, కార్యాచరణ కేంద్రంగా జి-20ని మలచాలని భారత్‌ భావిస్తున్నందువల్ల ఆ ప్రక్రియలో సభ్యదేశాలన్నీ కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులోనూ తమతో కలిసి అడుగువేయాలని కోరారు. తొలుత ఈ దీవిలో కాలాపత్తర్‌ బీచ్‌ వద్ద యోగాసనాలు నిర్వహించారు. సాగరతీర పరిశుభ్రతలోనూ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని