హత్యానంతరం ఆఫ్తాబ్‌ ఇంటికి సైకాలజిస్ట్‌!

శ్రద్ధా వాకర్‌ను హత్యచేసిన ఆమె ప్రియుడు ఆఫ్తాబ్‌... శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచుకుని, మరో యువతిని పలుమార్లు తన ఫ్లాట్‌కు పిలుచుకున్నాడని, ఆమె మానసిక వైద్యురాలు అని పోలీసులు ధ్రువీకరించారు.

Published : 27 Nov 2022 04:23 IST

డేటింగ్‌ యాప్‌లోనే పరిచయం...
శ్రద్ధా హత్యతో ఆమెకు సంబంధం ఉందా?

దిల్లీ: శ్రద్ధా వాకర్‌ను హత్యచేసిన ఆమె ప్రియుడు ఆఫ్తాబ్‌... శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచుకుని, మరో యువతిని పలుమార్లు తన ఫ్లాట్‌కు పిలుచుకున్నాడని, ఆమె మానసిక వైద్యురాలు అని పోలీసులు ధ్రువీకరించారు. శ్రద్ధా పరిచయానికి కారణమైన డేటింగ్‌ యాప్‌ ద్వారానే ఈ యువతి కూడా ఆఫ్తాబ్‌ను కలిసినట్టు తేల్చారు. అయితే శ్రద్ధా హత్యకూ, ఈ వైద్యురాలికీ సంబంధమేమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. డేటింగ్‌ యాప్‌ ద్వారా మరికొందరు మహిళలను ఆఫ్తాబ్‌ కలిసినట్టు తెలుస్తోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని