ఎలుకకు చిత్రహింసలు.. పోలీసులకు ఫిర్యాదు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎలుకపై దారుణంగా ప్రవర్తించాడో వ్యక్తి. దాని తోకకు రాయిని కట్టి కాలువలో పడేశాడు.

Updated : 27 Nov 2022 06:03 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎలుకపై దారుణంగా ప్రవర్తించాడో వ్యక్తి. దాని తోకకు రాయిని కట్టి కాలువలో పడేశాడు. దీంతో ఆ ఎలుక ప్రాణాలు కోల్పోయింది. బదాయూ జిల్లా పన్వాడియాకు చెందిన వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై జంతు ప్రేమికుడు వికేంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎలుకకు శవపరీక్ష నిర్వహించాల్సిందిగా కోరాడు. తాను ప్రత్యక్షంగా ఆ ఘటనను చూశానని పోలీసులకు తెలిపాడు. ఆ వ్యక్తి తన పిల్లలతో కలిసి ఎలుకను హింసిస్తుంటే వారిని వారించానని.. అయినా తన మాట వినలేదని చెప్పుకొచ్చాడు. ఎలుకను తీసే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే అది చనిపోయిందని వెల్లడించాడు. ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని