ప్రైడ్‌ మెట్రో స్టేషన్‌కు టీమ్‌ లీడర్‌గా హిజ్రా

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో హిజ్రాలకు అంకితం చేసిన ప్రైడ్‌ మెట్రో స్టేషన్‌కి టీమ్‌ లీడర్‌గా నిలిచింది మహీ. ఈ మెట్రోలో పనిచేసే వారంతా హిజ్రాలే.

Updated : 27 Nov 2022 06:55 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో హిజ్రాలకు అంకితం చేసిన ప్రైడ్‌ మెట్రో స్టేషన్‌కి టీమ్‌ లీడర్‌గా నిలిచింది మహీ. ఈ మెట్రోలో పనిచేసే వారంతా హిజ్రాలే. బిహార్‌లోని కటిహార్‌ జిల్లా సెమాపుర్‌ గ్రామానికి చెందిన మహీ గుప్తా.. హిజ్రా అని తెలియడం వల్ల 2007లో ఇంటి నుంచి వెళ్లగొట్టారు. 2008 నుంచి పిల్లలకు ట్యూషన్స్‌ చెబుతూ.. వచ్చే డబ్బుతో మహీ చదువుకుంది.

2017లో మహీ కుటుంబసభ్యులు ఆమెను తిరిగి ఇంటికి ఆహ్వానించారు. 2019లో హిజ్రాలకు దిల్లీ ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని తెలుసుకుని.. కష్టపడి చదివింది. ఉద్యోగం సాధించి.. టీమ్‌ లీడర్‌ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం తాను సాధించిన ఈ విజయంపట్ల గ్రామం నుంచి వెళ్లగొట్టిన వారే.. అభినందనలు తెలుపుతున్నారని మహీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని