UP: 12 కిలోల ఫిర్యాదు పత్రాలు తలపై మోస్తూ నిరసన..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురకు చెందిన ఓ రైతు భూ సంబంధిత వివాదాలపై ఆరేళ్ల నుంచి ఫిర్యాదు చేస్తున్నాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురకు చెందిన ఓ రైతు భూ సంబంధిత వివాదాలపై ఆరేళ్ల నుంచి ఫిర్యాదు చేస్తున్నాడు. న్యాయం జరుగుతుందనే ఆశతో అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. తన గోడును పట్టించుకోట్లేదు. దీంతో విసుగు చెందిన బాధితుడు.. 12 కిలోల ఫిర్యాదు పత్రాలను తలపై మోసుకుని సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్లి వినూత్నంగా నిరసన తెలిపాడు.
ధాకుబిబావాలి గ్రామానికి చెందిన చరణ్‌సింగ్ భూమిని గ్రామ పెద్దలు, కార్యదర్శి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో అతడు ఆరు సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఫిర్యాదు చేశాడు. అప్పటినుంచి ఇప్పటివరకు 211 సార్లు తన సమస్యపై అధికారులకు ఫిర్యాదు పత్రాలు అందించాడు. ఈ విషయంపై ఎస్‌డీఎం మంత్ర ఇంద్రనందన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఫిర్యాదు చేసిన వ్యక్తే గ్రామ సభ భూమిని ఆక్రమించాడు. అతడిపై చర్యలు కూడా తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Delhi liquor Scam: ముగిసిన విచారణ.. 8.30గంటల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ
-
India News
Nitin Gadkari: ₹10కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రికి బెదిరింపు కాల్.. గడ్కరీ ఇంటి వద్ద భద్రత పెంపు!
-
Movies News
Payal Rajput: పాయల్ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్లో పాల్గొని!
-
Sports News
Sachin Tendulkar: సచిన్ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్ మాజీ పేసర్..కారణమేమిటంటే?
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?