టీచర్‌ను ర్యాగింగ్‌ చేసిన విద్యార్థులు

ఉపాధ్యాయురాలిపై 12వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగింది.

Published : 28 Nov 2022 04:23 IST

ఉపాధ్యాయురాలిపై 12వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగింది. టీచర్‌ క్లాస్‌కు వెళ్లే సమయంలో ‘‘ఐ లవ్‌ యూ మేడమ్‌.. ఓయ్‌ మేడమ్‌..’’ అంటూ అసభ్యకర పదజాలాన్ని వాడారు. ఈ వ్యవహారం మొత్తాన్ని వాళ్లే వీడియో తీశారు. అనంతరం ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తనను చాలా కాలంగా వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని