విచారణలను సొంతంగా ప్రత్యక్ష ప్రసారం చేసే సాంకేతికతలు మనవద్ద లేవు

తృతీయ పక్ష అనువర్తనాలను ఉపయోగించుకోకుండా కోర్టు విచారణలను సొంతంగా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సరిపడా సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు సుప్రీంకోర్టు, జాతీయ ఇన్‌ఫర్మేటిక్స్‌ కేంద్రం (ఎన్‌ఐసీ) వద్ద ప్రస్తుతం లేవని సర్వోన్నత న్యాయస్థాన రిజిస్ట్రీ వెల్లడించింది.

Published : 28 Nov 2022 04:23 IST

సుప్రీంకోర్టుకు నివేదించిన రిజిస్ట్రీ

దిల్లీ: తృతీయ పక్ష అనువర్తనాలను ఉపయోగించుకోకుండా కోర్టు విచారణలను సొంతంగా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సరిపడా సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు సుప్రీంకోర్టు, జాతీయ ఇన్‌ఫర్మేటిక్స్‌ కేంద్రం (ఎన్‌ఐసీ) వద్ద ప్రస్తుతం లేవని సర్వోన్నత న్యాయస్థాన రిజిస్ట్రీ వెల్లడించింది. విచారణల ప్రత్యక్ష ప్రసారంపై కాపీరైట్‌ హక్కులను పదిలపర్చుకునేందుకు.. 2018 నాటి స్వప్నిల్‌ త్రిపాఠి కేసులో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా యూట్యూబ్‌తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకోవాలంటూ కె.ఎన్‌.గోవిందాచార్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఏడాది అక్టోబరు 17న తమ రిజిస్ట్రీకి సుప్రీంకోర్టు తాఖీదు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం కంప్యూటర్‌ సెల్‌ రిజిస్ట్రార్‌ హెచ్‌.ఎస్‌.జగ్గీ తాజాగా కోర్టులో ప్రమాణపత్రం సమర్పించారు. ప్రస్తుతానికైతే విచారణల ప్రత్యక్ష ప్రసారానికి థర్డ్‌ పార్టీ మీద ఆధారపడటం అనివార్యమవుతోందని అందులో పేర్కొన్నారు. ఇతరులపై ఆధారపడకుండా ఆ ప్రక్రియను సొంతంగా చేపట్టేందుకు అవసరమైన సాంకేతికతలను సముపార్జించుకునేందుకు రిజిస్ట్రీ నిరంతరం కృషిచేస్తోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని