500 తీసుకొని.. 20గా చూపించి.. రైల్వే ఉద్యోగి మోసం

అతడు టికెట్‌ కౌంటర్‌లో పని చేసే ఓ రైల్వే ఉద్యోగి. అవసరమైతే ప్రయాణికులకు కొన్ని సూచనలు చేసి వారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి. కానీ, అతడు చేసిన పని అతడి మోసపు బుద్ధికి అద్దం పడుతోంది.

Published : 28 Nov 2022 04:23 IST

చర్యలు చేపడతామన్న ఉన్నతాధికారులు

ఇంటర్నెట్‌డెస్క్‌: అతడు టికెట్‌ కౌంటర్‌లో పని చేసే ఓ రైల్వే ఉద్యోగి. అవసరమైతే ప్రయాణికులకు కొన్ని సూచనలు చేసి వారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి. కానీ, అతడు చేసిన పని అతడి మోసపు బుద్ధికి అద్దం పడుతోంది. దిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వేస్టేషన్‌లో టికెట్‌ కోసం వచ్చిన ప్రయాణికుడు రూ.500 ఇచ్చి గ్వాలియర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలుకు టికెట్‌ ఇవ్వమని కోరగా.. ఆయన్ని మాటల్లో పెట్టి.. రూ.500 కాజేశాడు. తన వద్దనున్న రూ.20 నోటును బయటకి తీసి.. ఇది టికెట్‌కు సరిపోదని, మరో రూ.125 ఇవ్వాలని ప్రయాణికుణ్ని డిమాండ్‌ చేశాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ‘రైల్‌విష్పర్స్‌’ అనే ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేయగా.. వైరల్‌గా మారింది. రైల్వే ఉన్నతాధికారులతో పాటు, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కూడా ట్యాగ్‌ చేశారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. సంబంధిత టికెట్‌ బుకింగ్‌ క్లర్క్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని