అత్యంత ఎత్తయిన శివుడి విగ్రహ సందర్శనకు అనుమతి

రాజస్థాన్‌లో కొలువుదీరిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శివుడి విగ్రహాన్ని ఆదివారం నుంచి భక్తులు సందర్శించేందుకు అనుమతిస్తున్నారు.

Published : 28 Nov 2022 06:57 IST

రాజస్థాన్‌లో కొలువుదీరిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శివుడి విగ్రహాన్ని ఆదివారం నుంచి భక్తులు సందర్శించేందుకు అనుమతిస్తున్నారు. విశ్వాస స్వరూపం పేరిట సుమారు 369 అడుగుల ఎత్తుగల ఈ విగ్రహం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోరీ బాపు చేతుల మీదగా ఆవిష్కరించారు. ఆలయంలోని వివిధ ఎత్తులకు చేరుకునేందుకు నాలుగు లిఫ్ట్‌లను సైతం ఏర్పాటు చేశారు. దీని ద్వారా త్రిశూలాన్ని దగ్గరగా చూడొచ్చు. ఈ కేంద్రాన్ని సందర్శించేందుకు 200 రూపాయల ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని