ఉలితో శిలలకు జీవం..
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన దీపక్ విశ్వకర్మ అనే శిల్పి రాళ్లపై బొమ్మలను అద్భుతంగా చెక్కుతున్నాడు. మనుషులను చూసి వారిని అచ్చుగుద్దినట్లుగా రాళ్లపై వారి రూపాన్ని చెక్కడం అతడి ప్రత్యేకత.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన దీపక్ విశ్వకర్మ అనే శిల్పి రాళ్లపై బొమ్మలను అద్భుతంగా చెక్కుతున్నాడు. మనుషులను చూసి వారిని అచ్చుగుద్దినట్లుగా రాళ్లపై వారి రూపాన్ని చెక్కడం అతడి ప్రత్యేకత. మహాత్మాగాంధీ, బి.ఆర్.అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని వాజ్‌పేయీ, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖుల రూపాలను రాళ్లపై సుందరంగా చెక్కాడు. అంతేకాదు.. దేవుళ్ల ప్రతిరూపాలనూ అద్భుతంగా చెక్కగలడు. మన దేశమే కాకుండా విదేశీయుల డిమాండ్ మేరకు చిన్న విగ్రహాలను తయారు చేసి ఫ్రాన్స్, స్పెయిన్, పారిస్, దుబాయ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. ఇటీవలే 4.5 కిలోల రాయితో నీటిలో తేలియాడే పడవను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు దీపక్. సీతారామలక్ష్మణులు అందులో ఆశీనులై ఉంటారు. ఈ విగ్రహాన్ని చూసిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. దీపక్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: ఆ హీరోతో ఫొటో దిగినందుకు ఖుష్బూ సుందర్ ఆనందం.. పులివెందులలో అషు!
-
India News
IndiGo: అత్యవసర ద్వారం కవర్ తొలగింపు యత్నం.. విమానం గాల్లో ఉండగా ఘటన!
-
Technology News
E-Waste: ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్ అడుగులు!
-
General News
TTD: తిరుమలలో ఆగమశాస్త్రాన్ని విస్మరిస్తున్నారు: రమణ దీక్షితులు
-
Movies News
Rajinikanth: అనుమతి లేకుండా అలా చేస్తే చర్యలు తప్పవు :రజనీకాంత్
-
India News
Narendra Modi : ఆదివాసీ సేవలో విరిసిన ‘పద్మా’లు: మోదీ