భారతీయుల్లో అదుపు తప్పుతున్న అధిక రక్తపోటు!

అధిక రక్తపోటుతో బాధపడుతున్న భారతీయుల్లో 75% మందికి బీపీ అదుపులోకి రావడంలేదని ద లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌ జర్నల్‌ వెల్లడించింది.

Published : 29 Nov 2022 04:34 IST

దిల్లీ: అధిక రక్తపోటుతో బాధపడుతున్న భారతీయుల్లో 75% మందికి బీపీ అదుపులోకి రావడంలేదని ద లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌ జర్నల్‌ వెల్లడించింది. బోస్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, దిల్లీలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ పరిశోధకులు సంయుక్తంగా దీన్ని చేపట్టారు. 2001-2020 మధ్య అధిక రక్తపోటుపై చేపట్టిన 51 అధ్యయనాలను విశ్లేషించారు. వీటిలో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 13.90 లక్షల మంది ఆరోగ్య వివరాలున్నాయి. మొదట్లో కేవలం 17.5% మాత్రమే ఉన్న రక్తపోటు నియంత్రణ రేటు... ఆ తర్వాత కొంత మెరుగై 22.5 శాతానికి చేరుకున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ‘‘సిస్టాలిక్‌ రక్తపోటు 140, డయాస్టాలిక్‌ రీడింగ్‌ 90 కంటే తక్కువ ఉంటే బీపీ నియంత్రణలో ఉన్నట్టుగా భావించి ఈ విశ్లేషణ సాగించాం. ప్రస్తుతం కేవలం 24.2% మంది బాధితుల్లో మాత్రమే రక్తపోటు నియంత్రణలో ఉంటోంది. బాధితుల్లో కేవలం 46.8% మందికే తమకు హైబీపీ ఉన్నట్టు తెలుసు’’ అని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. కేరళకు చెందిన ప్రభుత్వ వైద్య కళాశాల (మంజేరి), కిమ్స్‌ అల్‌-షిఫా స్పెషాలిటీ ఆసుపత్రి (పెరింతల్మన్న) పరిశోధకులు కూడా ఈ విశ్లేషణలో పాలుపంచుకున్నారు. అధిక రక్తపోటుపై ప్రజలకు అవగాహన కలిగించడం ద్వారా హృద్రోగాలను, మరణ ముప్పును గణనీయంగా తగ్గించే అవకాశముందని పరిశోధకులు సూచించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని