TATA Steel: వందేళ్ల నాటి 110 మీటర్ల చిమ్నీ కూల్చివేత

ఝార్ఖండ్‌లోని జంశెద్‌పుర్‌ టాటా స్టీల్‌ ప్లాంట్‌లో ఉన్న వందేళ్ల నాటి 110 మీటర్ల పొడవైన చిమ్నీని కూల్చివేశారు.

Updated : 29 Nov 2022 07:04 IST

ఝార్ఖండ్‌లోని జంశెద్‌పుర్‌ టాటా స్టీల్‌ ప్లాంట్‌లో ఉన్న వందేళ్ల నాటి 110 మీటర్ల పొడవైన చిమ్నీని కూల్చివేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థ సహకారంతో కూల్చివేత కార్యక్రమం చేపట్టినట్లు టాటా స్టీల్‌ ప్లాంటు వర్గాలు తెలిపాయి. 11 సెకన్లలో కూల్చివేత పూర్తయినట్లు పేర్కొన్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాంట్‌లో కొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నామని.. ఇందులో భాగంగానే చిమ్నీని కూల్చివేసినట్లు టాటా స్టీల్‌ ప్లాంట్‌ ప్రతినిధులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని