పొట్ట విప్పి చూడ నాణేలు ఉండు!

ఈ చిత్రంలో కనిపిస్తున్న రోగి పేరు ద్యానప్ప(58). స్వస్థలం కర్ణాటకలోని రాయచూరు. బాగల్‌కోటెలో భిక్షం ఎత్తుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు.

Published : 29 Nov 2022 04:34 IST

రోగి కడుపు నుంచి 187 నాణేలు తీసిన వైద్యులు

ఈ చిత్రంలో కనిపిస్తున్న రోగి పేరు ద్యానప్ప(58). స్వస్థలం కర్ణాటకలోని రాయచూరు. బాగల్‌కోటెలో భిక్షం ఎత్తుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. శనివారం కడుపు నొప్పితో బాధపడుతుండగా ఆయన బంధువులు స్థానిక ఎస్‌.నిజలింగప్ప వైద్య కళాశాల అనుబంధ వైద్యశాలలో చేర్పించారు. స్కానింగ్‌ చేయగా పొట్టలో నాణేలు కనిపించాయి. ల్యాప్రోస్కోపిక్‌ విభాగ ప్రధాన నిర్వాహకుడు డాక్టర్‌ ఈశ్వర్‌ కలబురగి నేతృత్వంలో ఆదివారం రోగికి శస్త్రచికిత్స చేసి బాధితుడి కడుపులో 1.5 కిలోల బరువుతో ఉన్న 187 నాణేలను బయటకు తీసేశారు. వీటిలో ఐదు రూపాయల నాణేలు 56, రూ.2 నాణేలు 51, రూపాయి నాణేలు 80 ఉన్నాయి. ఈ రోగి వివరాల్లోకెళితే.. ద్యానప్ప స్కిజోఫ్రెనిక్‌ డిసార్డర్‌తో బాధపడుతుండేవాడు. ఎంత తిన్నాఆకలి తీరకపోవటంతో 2018 నుంచి నాణేలను మింగేస్తున్నాడు. మలం ద్వారా కొన్ని బయటకు వచ్చేసేవి. పొట్టలో కొన్ని నాణేలు ఉండిపోవడంతో చివరకు ఉబ్బరానికి లోనై కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.  
-ఈనాడు, బెంగళూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని