డ్రోన్లను వేటాడే గద్దలు

శత్రు దేశాల డ్రోన్ల పని పట్టేందుకు భారత సైన్యం సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.

Published : 30 Nov 2022 03:54 IST

భారత సైన్యం సరికొత్త ఆయుధం

దిల్లీ: శత్రు దేశాల డ్రోన్ల పని పట్టేందుకు భారత సైన్యం సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఈ విధమైన కార్యక్రమం ఆర్మీలో ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్‌లోని ఔలీలో సాగుతోన్న భారత్‌, అమెరికాల ఉమ్మడి సైనిక శిక్షణ కసరత్తులు ‘యుద్ధ్‌ అభ్యాస్‌’లో ఈ శిక్షణ ఫలితాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా.. తొలుత ఓ డ్రోన్‌ను గాల్లో ఎగురవేశారు. దాని శబ్దాన్ని గ్రహించిన ఓ ఆర్మీ శునకం.. సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే డ్రోన్లను వేటాడే శిక్షణ పొందిన ‘అర్జున్‌’ అనే గద్ద.. గాల్లోని ఆ డ్రోన్‌ను కూల్చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని