ది కశ్మీర్ ఫైల్స్‌లో సన్నివేశాలు అసత్యమని నిరూపించండి!
సంచలన విజయం సాధించిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ప్రచారం కోసం తీసినది, అసభ్యకరమైనది అని పేర్కొంటూ ఇజ్రాయెల్ చిత్ర దర్శకుడు, అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ/ఇఫీ) జ్యూరీ అధ్యక్షుడు నడవ్ లాపిడ్ సోమవారం రాత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది.
అలా చేస్తే సినిమాలకు దూరమవుతా..
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సవాలు
ముంబయి: సంచలన విజయం సాధించిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ప్రచారం కోసం తీసినది, అసభ్యకరమైనది అని పేర్కొంటూ ఇజ్రాయెల్ చిత్ర దర్శకుడు, అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ/ఇఫీ) జ్యూరీ అధ్యక్షుడు నడవ్ లాపిడ్ సోమవారం రాత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో రాజకీయనేతలు, సామాజిక కార్యకర్తలు, నెటిజన్లు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా మారిపోయి విమర్శలు కొనసాగిస్తున్నారు.
తాజాగా లాపిడ్ వ్యాఖ్యలపై ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, ఆ సినిమాలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నటుడు అనుపమ్‌ఖేర్ తీవ్రంగా స్పందించారు. ‘‘సత్యమనేది అత్యంత ప్రమాదకరమైన విషయం.. అందుకే ప్రజలు అసత్యాలు చెబుతుంటారు’’ అని అగ్నిహోత్రి ట్విటర్లో పేర్కొన్నారు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో చూపించిన ఏ సంఘటనైనా అసత్యమని లాపిడ్ సహా మేధావులు ఎవరైనా సరే నిరూపిస్తే తాను ఇకపై చిత్రాలు నిర్మించబోనని సవాలు చేశారు. తన వ్యతిరేకులతో ఘర్షణను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అంతకుముందు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ..‘‘నిజం ఎప్పుడూ అబద్ధాన్ని తుంగలో తొక్కుతుంది..అసత్యం ఎంత పెద్దదైనా ఫర్వాలేదు. సత్యంతో పోలిస్తే అది ఎప్పుడూ అల్పమైనదే. నిజాలు చూడలేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి’’ అని పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీర్‌లోని హిందువులను ఊచకోత కోయడం, దారుణంగా హతమార్చడం వంటి చర్యలతో వారు కశ్మీర్ నుంచి వలసపోయేటట్లు చేసిన ఉగ్రవాదుల దమనకాండ ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రధాన ఇతివృత్తం.
* తాను చేసిన వ్యాఖ్యలపై నడవ్ లాపిడ్ సిగ్గుతో తలవంచుకోవాలి..ఆయన అత్యంత దారుణంగా దుర్భాషలాడారు.. అని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నావొర్ గిలన్ వ్యాఖ్యానించారు.
* జ్యూరీ సభ్యుడైన సుదీప్తో సేన్ మాట్లాడుతూ లాపిడ్ వ్యాఖ్యలతో తనకు, జ్యూరీలోని ఇతర సభ్యులకు సంబంధంలేదని ప్రకటించారు. అవి ఆయన వ్యక్తిగతమైనవని తేల్చి చెప్పారు.
* ‘‘హిట్లర్ హయాంలో లక్షలాది యూదులను హతమార్చిన హోల్కాస్ట్ను ప్రజలు చాలాకాలం విశ్వసించలేదు..అలాగే షిండ్లర్స్ జాబితాను ప్రచారంగా పేర్కొన్నారు..ప్రస్తుతం ది కశ్మీర్ ఫైల్స్‌పై కొందరు అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. సత్యమే చివరకు విజయం సాధిస్తుంది’’ అని భాజపా ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ పేర్కొన్నారు.
* ‘‘క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలియని వ్యక్తుల నుంచే అటువంటి వ్యాఖ్యలు వస్తాయి. నిరాశ్రయులైన కశ్మీరీ పండిట్లు ఆశ్రయం పొందుతున్న జమ్మూ-కశ్మీర్‌లోని క్యాంపులను లాపిడ్ సందర్శించాలి’’ అని జమ్మూ-కశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా సూచించారు.
* ‘‘ది కశ్మీర్ ఫైల్స్‌పై సాగుతున్న చర్చ భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. లాపిడ్ వ్యాఖ్యలను నేను అంగీకరించబోను. వాటితో మా దేశానికి సంబంధం లేదు. ఆ సినిమా ప్రచారం కాదు. అది కశ్మీర్ ప్రజల బాధలకు వేదికగా నిలిచిన శక్తిమంతమైన చిత్రం’’ అని మధ్య పశ్చిమ భారత్ ఇజ్రాయెల్ కాన్సూల్ జనరల్ కొబ్బీ షోషాని అభివర్ణించారు. అంతేకాకుండా నటుడు అనుపమ్ ఖేర్‌కు క్షమాపణలు కూడా తెలిపారు. ఆ వ్యాఖ్యలు లాపిడ్ వ్యక్తిగతమైనవని తేల్చి చెప్పారు.
* ది కశ్మీర్ ఫైల్స్‌పై లాపిడ్ వ్యాఖ్యలు గతంలో భయానక పరిస్థితులను ఎదుర్కొన్న కశ్మీర్ హిందువులను అవమానించడమేనని భాజపా గోవా అధికార ప్రతినిధి సావియో రోడ్రిగ్స్ అభివర్ణించారు.
* ద్వేషం ఎప్పటికైనా నాశనమవుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Movies News
Social Look: సిల్క్‌స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే