రెండు పాకిస్థాన్‌ డ్రోన్ల కూల్చివేత

పంజాబ్‌లో ఉన్న భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు మీదుగా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న రెండు పాక్‌ డ్రోన్లను సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది కూల్చివేసింది.

Published : 30 Nov 2022 04:59 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో ఉన్న భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు మీదుగా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న రెండు పాక్‌ డ్రోన్లను సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది కూల్చివేసింది. వాటి నుంచి పది కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. తొలి సంఘటనలో.. మూడు కిలోలకుపైగా మాదకద్రవ్యాలతో పాక్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను అమృత్‌సర్‌ వద్ద బీఎస్‌ఎఫ్‌ మహిళా బృందం కూల్చివేసింది. అమృత్‌సర్‌కు 40 కి.మీ. దూరంలో చహర్‌పుర్‌ గ్రామ సమీపంలో భారత భూభాగంలోకి పాక్‌ డ్రోన్‌ సోమవారం రాత్రి ప్రవేశించిందని మహిళా సైనికులు గుర్తించారు. ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ మహిళా సిబ్బంది దానిపై కాల్పులు జరిపి నేలకూల్చారు. మరో సంఘటనలో.. తరన్‌తరన్‌ జిల్లాలోని కలశ్‌ హవేలియన్‌ గ్రామం నుంచి మన దేశంలోకి ప్రవేశిస్తున్న మరో డ్రోన్‌ను తమ సిబ్బంది కూల్చేశారని బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. అందులో నుంచి 6.6 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వడాయి చీమా సరిహద్దులోనూ మరో డ్రోన్‌ను గుర్తించామని, దానిపై కాల్పులు జరిపేలోగా అది పాకిస్థాన్‌ వైపు వెళ్లిందని బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది వివరించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు